14 June, 2026 | 4:25 AM

ఆ నంబర్ నాది కాదు

14-06-2026 12:17 AM

హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు మీనాక్షి చౌదరి పేరుతో ఒక ఫేక్ వాట్సాప్ నంబర్‌ను క్రియేట్ చేసి, కొందరికి మెసేజ్‌లు పంపుతూ డబ్బులు అడుగుతున్నట్లు ఆమె దృష్టికి వచ్చింది. దీంతో మీనాక్షి చౌదరి అప్రమత్తమై, అభిమానులను అలర్ట్ చేసింది. “నా పేరుతో ఫేక్ నంబర్ ఉపయోగించి కొందరు మోసాలకు పాల్పడుతున్నారు.  ఎవరూ వారిని నమ్మి మోసపోవద్దు.

ముఖ్యంగా 7604891175  నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్‌లు, కాల్స్ వచ్చినా స్పందించొద్దు. ఆ నంబర్ నాది కాదు. ఒకవేళ ఆ నంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తే దయచేసి నాకు తెలియజేయండి” అని రాసుకొచ్చింది. మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. నాగచైతన్య సరసన ఆమె నటించిన ‘వృషకర్మ’ షూటింగ్ దశలో ఉంది. తమిళ స్టార్ కార్తీతోనూ ఆమె ఓ సినిమా చేస్తోంది. కార్తీ కెరీర్‌లో మైలుచిత్రం ‘కార్తి30’ ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉంది.

ఆయన తెలుగులో చేస్తున్న డైరెక్ట్ మూవీ కూడా ఇదే. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గత మేలో పూజా కార్య క్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోందని టాక్. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కార్తీ, మీనాక్షి కాంబోలో కీలక సన్నివేశాల చిత్రీకరిస్తు న్నారని సమాచారం.