కాశీ అయోధ్యకు టీజీ ఆర్టిసి సర్వీస్
05-04-2026 04:28 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో కాశీ, అయోధ్య టూర్ బస్సు బయలుదేరిందని డిపోమేనేజర్ కే పండరి తెలిపారు.ఈ బస్సు మైహార్, ప్రయాగరాజ్,కాశీ, అయోధ్య,నైమి శారణ్య, ఉజ్జాయిని, ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రలకు వెళ్లి వస్తుందని ఆయన తెలిపారు. ప్రయాణికుల ఆదరణతో అయోధ్య బస్సు వెళ్లడం ఇది నాలుగో సారి అని ఆయన తెలిపారు. ఈ ట్రిప్ తిరిగి రాగానే గోవా,రామేశ్వరం టూర్ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ యొక్క టూర్ ప్యాకేజీల ను సద్వినియోగ పరచుకొని సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.




