15 May, 2026 | 8:15 PM

Breaking News

పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •   మోడీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. రెండు నాలుకల సర్కార్   •   మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోమయ్య   •  

అమరుల త్యాగాలతోనే తెలంగాణ సాకారం

04-12-2025 12:10 AM

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఆనాడు శ్రీకాంతా చారి ప్రాణ త్యాగంతోనే తెలంగాణ అగ్ని గుండంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. రాష్ట్ర సాధనకు అమరుడైన శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా బుధవారం ఆదిలాబాద్ లోని ఆయన విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ మేరకు జోగు రామన్న మాట్లాడు తూ... అమరుల త్యాగాలతోనే ప్రత్యేక తెలంగా ణ రాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంత చారి త్యాగం చిరస్మరనీయంగా నిలిచిపోతుందని అన్నారు. అమరుల త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని పేర్కొన్నారు.

వారి ఆశయాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రా హ్మణ, విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు సామన్ పెళ్లి నరసింహులు, ప్రధాన కార్యదర్శి స్వామి, కోశాధికారి దశరథ్,  అశోక్, రవి, నరసింహులు,పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, దాసరి రమేష్,రాజు, ధమ్మపాల్ తదితరులు పాల్గొన్నారు.