9 July, 2026 | 11:10 PM

వరంగల్, హన్మకొండలో గవర్నర్ పర్యటన

09-07-2026 11:47 AM

హన్మకొండ: తెలంగాణ గవర్నర్(Telangana Governor) శివ ప్రతాప్ శుక్లా గురువారం నాడు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. హన్మకొండలోని ఎన్‌ఐటీకి చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను హనుమకొండ కలెక్టర్(Hanamkonda Collector) చాహత్ బాజ్ పాయి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎన్‌పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.