17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

టీసీఎస్ ఐవోన్‌తో ఎంవోయూ

03-12-2025 12:00 AM

జయప్రకాశ్ నారాయణ కాలేజీ ఒప్పందం

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో టీసీఎస్ ఐవోఎన్ కంపెనీ మధ్య జాబ్ అచీవర్ అనే కార్యక్రమంనకు సంబంధించిన ఎంవోయూ కుదుర్చుకున్నారు. తెలంగాణ అకడమిక్ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి శ్రీకాంత్ సిన్హా పాల్గొన్నారు.

ఆయన ప్రసంగిస్తూ.. జేపీఎన్‌సీఈ ఆర్కిటెక్ట్ కేఎస్ రవికుమార్ అని తెలిపారు. విద్యార్థులు ముఖ్యంగా ఫండమెంటల్స్ అంశాలపై దృష్టి సారించాలని కోరారు. . కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. టీసీఎస్ కంపెనీతో జాబ్ అచివార్ ఎంవోయూ కుదుర్చుకున్న కళాశాల జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రంలోనే మొదటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల అని తెలిపారు.

అలాగే ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగాలు సాధించిన  కే భవిత, ఏ భార్గవి, మధులికలకు ప్రతి ఒక్కరికి రూ.50 వేల చెక్కును అందచేశారు. కార్యక్రమములో టీసీఎస్ కంపెనీ ప్రతినిధులు అర్జున్, సౌమ్య, హరికృష్ణ, అజయ్ ఇర్ఫాన్, టాస్క్ ప్రతినిధు లు ప్రదీప్, సిరాజ్,సీనియర్ న్యాయవాది వీ మనోహర్‌రెడ్డి, కలశాల వైస్ చైర్మన్ సీ భాస్కర్, కార్యదర్శి వీ వెంకటరామరావు, ప్రిన్సిపాల్ డా పీ. కృష్ణమూర్తి, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డా.వీ ఈ చంద్రశేఖర్, పరీక్షల నిర్వహణ అధికారి కోటల సందీప్ కుమార్, కోటల సాయితేజ పాల్గొన్నారు.