13 August, 2026 | 4:01 PM

గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాళ్లపల్లి భాస్కర్‌రావు

13-08-2026 02:50 PM

గణపురం,(విజయక్రాంతి): గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాళ్లపల్లి భాస్కర్‌రావు గురువారం ఎన్నికయ్యారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల అధ్యక్షులను రాష్ట్ర పార్టీ ప్రకటించింది. అందులో భాగంగా గణపురం మండల శాఖ అధ్యక్షుడిగా భాస్కర్ రావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ లకు భాస్కర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పనిచేస్తానని ఆయన అన్నారు. పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.