2 April, 2026 | 3:17 AM

సన్‌రైజ్ అయ్యేనా?

02-04-2026 01:34 AM

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్

బలహీనంగా సన్‌రైజర్స్ బౌలింగ్

తుది జట్టులో మార్పులు

కోల్‌కతా, ఏప్రిల్ 1: ఐపీఎల్ 19వ సీజన్ లో గురువారం ఆసక్తికర పోరు జరగబోతోంది. ఈ సీజన్‌ను పరాజయాలతో ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ ఢీకొట్టబోతున్నాయి. ఇరు జట్లకు బౌలింగే బలహీనంగా ఉంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ బౌలర్లకు సవాల్ కానుంది. ఈ సీజన్ ఆరంభాని కి ముందే సన్ రైజర్స్ బౌలింగ్ బలహీనంగా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. దానికి తగ్గట్టే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో మ్యాచ్‌లో సన్ రైజర్స్ బౌలర్లందరూ పూర్తిగా విఫలమయ్యారు.

అదే సమయం లో టాప్ 3 బ్యాటర్ల వైఫల్యం కూడా ఓటమి కి కారణమైంది. దీంతో ఆ మ్యాచ్‌లో తప్పిదాలను సరిదిద్దుకోవడంపై ఆరెంజ్ ఆర్మీ దృష్టి పెట్టింది. బలహీనంగా ఉన్న బౌలింగ్‌ను బలోపేతం చేయాలని భావిస్తోంది. ఈ డెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో బౌలర్లకు ఛాలెంజ్ ఎదురుకానుంది. ఈ క్రమంలో సన్‌రైజర్స తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. ఆర్సీబీతో మ్యాచ్‌లో ధారళంగా పరుగులిచ్చిన ఎషాన్ మలింగాపై వేటు వేసే అవ కాశాలు ఉన్నాయి.

అతని స్థానంలో బ్రైడన్ కార్స్‌ను ఆడించొచ్చు. అలాగే లియామ్ లివింగ్ స్టోన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని ఆలోచిస్తోంది. అప్పుడు శివమ్ మావి, ప్రఫుల్ హింగే, శివాంగ్ కుమార్లో ఒకరికి అ వకాశం దక్కుతుంది.బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా ఆడనుండగా.. ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి మిడిలార్డర్లో ఆడనున్నారు. ఓపెనర్లు శుభారంభం అందించాల్సి న అవసరం ఉంది. అనికేత్ వర్మ, లివింగ్ స్టోన్ ఫినిషర్ పాత్ర పోషించనున్నారు. లి వింగ్ స్టోన్ ఆడకపోతే సలీల్ అరోరా తుది జట్టులో కొనసాగుతాడు. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్, హర్ష్ దూబే బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.

హర్ష్ దూబే వద్దనుకుంటే జీషన్ అన్సారీ తుది జట్టులోకి వస్తాడు. మరోవైపు కేకేఆర్ కూడా ఓటమితో నే ఈ టోర్నీని మొదలు పెట్టింది. తొలి మ్యా చ్‌లో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై  ముందు పెట్టినా బౌలింగ్ బలహీనంగ కా పాడుకోలేకపోయింది. బ్యాటింగ్‌లో మా త్రం అదరగొట్టింది. ఓపెవర్లు ఫిన్ అలెన్ , సివర్ట్ మెరుపు ఆరంభాలనిస్తున్నారు. కెప్టెన్ రహానే ఫామ్ లో ఉండగా...కామెరూన్ గ్రీన్, రఘువంశీపై అంచనాలున్నాయి. వైస్ కెప్టెన్ గా ప్రమోట్ అయిన రింకూ సింగ్ ఫినిషర్ రోల్ పోషించాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో కేకేఆర్ కూడా వీక్‌గానే ఉంది. తొలి మ్యాచ్ లో 221 పరుగులు స్కోరు చేసినా దానిని కాపాడుకోలేకపోయింది. దీంతో బౌలింగ్ మెరుగుపడితే తప్ప నైట్‌రైడర్స్ విజయంపై ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు.

గత రికార్డులు

ఇరు జట్లు ఇప్పటి వరకూ 30 మ్యాచ్‌ల లో తలపడగా కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 విజయాలతో ఆధిపత్యం కనబరుస్తోంది. సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌లలో మాత్రమే గెలవగలిగింది.

పిచ్ రిపోర్ట్ 

ఈడెన్ గార్డెన్స్ సహజంగానే బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్. ఇక్కడ అత్యధిక పరుగుల టార్గెట్‌ను ఛేదించిన రికార్డులు కూడా ఉన్నాయి. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునేందుకే మొగ్గు చూపుతుంది.

తుది జట్లు అంచనా

సన్‌రైజర్స్ హైదారాబాద్ : హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్), క్లాసెన్, అని కేత్ వర్మ, లివింగ్‌స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, హర్ష దూబే , బ్రైడన్ కార్సే, ఉనాద్కట్

కోల్‌కతా నైట్‌రైడర్స్ : టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్, రహానే (కెప్టెన్), రఘువంశీ, కామెరూన్ గ్రీన్, రింకూ సింగ్, రమణ్‌దీప్,  నరైన్, వైభవ్, ఉమ్రాన్ మాలిక్, వరుణ్.