5 June, 2026 | 11:09 PM

రిషి డాన్స్ అకాడమీలో సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకలు

05-06-2026 10:02 PM

విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేత

కోదాడ,(విజయక్రాంతి): రిషి డాన్స్ అకాడమీలో సమ్మర్ క్యాంపు 45 రోజులు ముగింపు కార్యక్రమం శుక్రవారం చేశారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు హాజరై మాట్లాడారు. డ్యాన్స్ లో శిక్షణ పట్ల డ్యాన్స్ మాస్టర్ నాగేశ్వరరావును అభినందించారు.  డ్యాన్స్ శిక్షణలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్స్ అందజేశారు. మాస్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కట్టబోయిన జ్యోతి శ్రీను, కేఆర్  కాలేజీ లెక్చరర్ వేముల వెంకటేశ్వర్లు, కొల్లు. క్షత్రియ, సీనియర్ నాయకులు  గంధం పాండు, ఇంటి యజమాని వెంకటేశ్వర్లు, నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.