షూటింగ్ ముగించిన సుకుమారి
యంగ్ హీరో తిరువీర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ తమ గత చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడీ జంట మరోసారి తెరపై సందడి చేయబోతోంది. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రమే ‘ఓ.! సుకుమారి’. నూతన దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్న విలేజ్ ఎంటర్‌టైనర్‌ను గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తు న్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్‌లో వస్తున్న తాజా చిత్రమిది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘రజాకార్’, ‘పొలిమేర’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సీహెచ్ కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు పూర్ణచారి పాటలు రాస్తున్నారు. ‘బలగం’ ఫేమ్ తిరుమల ఎం తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌గా, ‘క’ చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీవరప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.




