9 April, 2026 | 6:55 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు

09-04-2026 04:52 PM

ప్రభుత్వ పెద్దలకు పాలాభిషేకం – సంబరాల్లో రైతులు ప్రవీణ్ టోనీ

తంగళ్ళపల్లి ఏప్రిల్ 9 (విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పాపయ్యపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు చేయడంపై స్థానిక నాయకులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. సుమారు రూ.3 కోట్ల 40 లక్షల వ్యయంతో ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా పాపయ్యపల్లి, గోపాలరావుపల్లి, తాడూరు, బెంద్రంపల్లి గ్రామాల రైతులకు మరియు గృహ వినియోగదారులకు లో వోల్టేజ్ సమస్యలు లేకుండా నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించనున్నట్లు తెలిపారు. సెస్ పరిధిలోని గ్రామాల్లో ఈ నిర్ణయంపై రైతులు సంబరాలు జరుపుకున్నారు.

ఎంపిడిసిల్ ఎస్ఈ బిక్షపతికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే స్థానిక నేత కేకే మహేందర్ రెడ్డి చేసిన కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు రాష్ట్ర మంత్రివర్గ నాయకులకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నేరళ్ల నర్సింగం గౌడ్, తాడూరు సర్పంచ్ సదానందం, డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, పరుశురాం, శైలజ, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వేల్పుల సాయి ప్రసాద్, మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, నాయకులు శ్రీరామ్, కిషన్, ప్రేమ్ తదితరులు, రైతులు పాల్గొన్నారు.