22 July, 2026 | 3:45 PM

Breaking News

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •   కొమురవెల్లిలో దాశరథి జయంతి ఉత్సవాలు   •   గిరిజన ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ కొరత   •   సోనాల ఆసుపత్రి డాక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయండి   •  

అసాధారణ జనాభా మార్పులపై అధ్యయనం

27-05-2026 01:15 AM

కమిటీ ఏర్పాటు: కేంద్రమంత్రి అమిత్ షా

న్యూ ఢిల్లీ, మే 26: దేశ జనాభాలో చోటుచేసుకుంటున్న అసాధారణ మార్పులను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిం ది. రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్‌ను దీనికి చైర్‌పర్సన్‌గా నియమించింది. అక్రమ వలసలు, ఇతర అసాధారణ కారణాల వల్ల భారతదేశవ్యాప్తంగా జనాభాలో వస్తున్న మార్పులను ఈ కమిటీ అంచనా వేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ఎక్స్‌లో తెలిపారు.

ఇది మత, సామాజిక వర్గాల స్థాయిలో అసాధారణ మార్పుల సరళిని కూడా అధ్యయనం చేసి, పరిష్కారాలను ప్రతిపాదిస్తుందన్నారు. జనాభాలో వచ్చే అసాధారణ మార్పులు ఏ దేశా నికైనా వర్తమాన, భవిష్యత్తులకు ఒక పెద్ద సవాలుగా నిలుస్తాయని షా పేర్కొన్నారు. ఈ కమిటీలో సభ్యులుగా దేశ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీ వాస్తవ, డాక్టర్ షమికా రవి ఉన్నారు.