17 June, 2026 | 12:12 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

విద్యార్థులు మంచి స్నేహితులను ఎంచుకోవాలి

16-06-2026 02:06 AM

ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ క్రైo, జూన్ 15 : విద్యార్థులు మంచి స్నేహితులను ఎంచుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని పానగల్ లో ప్రభుత్వ పాఠశాల ప్రారంభం రోజున విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, ఉపా ధ్యాయులు చెప్పిన మాటలు వినాలని వారి మార్గదర్శకంలో నడిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.

సామాజిక మాధ్యమాలకు, ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలని,లింకులు ఓపెన్ చేయద్దని,గంజాయి, మత్తు కు దూరంగా ఉండాలని, రోడ్డు దాటే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తల్లిదండ్రులు వాహనాలు నడిపితే హెల్మెట్ ధరించాలని చెప్పాలని కోరారు. కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి, సిఐ రాఘవరావు, ఎస్‌ఐ మానస ఉన్నారు.