5 June, 2026 | 8:27 PM

జ్యోతిష్మతిలో “స్పేషియల్ కంప్యూటర్స్” సదస్సు

05-06-2026 06:10 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (ఆటానమస్), కరీంనగర్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు  “స్పేషియల్ కంప్యూటర్స్”పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమెరికా నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పేషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ గ్రూప్ హెడ్ మల్లేష్ దాసరి ముఖ్య వక్తగా పాల్గొని స్పేషియల్ కంప్యూటింగ్, AI, AR, VR వంటి ఆధునిక సాంకేతికతలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా చైర్మన్  జె. సాగర్ రావు  మాట్లాడుతూ విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్‌పోజర్, ఇన్నోవేషన్ కల్పించడమే లక్ష్యమని తెలిపారు. సెక్రటరీ, కరస్పాండెంట్ జె. సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డా. టి. అనిల్ కుమార్, డీన్ అకాడెమిక్స్ & ఆడిట్ డా. పి. కె. వైశాలి, సిఎస్‌ఈ హెచ్‌వోడీ డా. ఆర్. జగదీశన్ పాల్గొన్నారు. సదస్సును డా. కె. శశికాంత్ మరియు జి. సింధూష సమన్వయం చేశారు.