30 August, 2026 | 11:22 AM

Breaking News

అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన కిసాన్ మోర్చా నేతలు   •   అక్రమంగా పశువులను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తుల అరెస్ట్   •   కడియాల కుంట సర్పంచ్ పై ఆశ కార్యకర్త ఎమ్మెల్యేకు ఫిర్యాదు   •   నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి   •   నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి   •   NEET PG 2026: దేశవ్యాప్తంగా నీట్ పీజీ 2026 పరీక్ష   •   10కే పరుగుకు ఐటీ కారిడార్‌ బలి!   •   అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన డీఐసీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్   •   అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి   •   ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య   •  

నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి

30-08-2026 11:12 AM

ఇబ్రహీంపట్నం,అగస్టు30 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగూడ నీట్ పీజీ  పరీక్ష కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. ఓ విద్యార్థి మద్యం సేవించి పరీక్షకు హాజరైనట్లు అధికారులు గుర్తించారు. ​పరీక్ష కేంద్రంలోకి ప్రవేశిస్తున్న సమయంలో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన సిబ్బంది తనిఖీ చేయగా, అతను మద్యం తాగి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అధికారులు అతన్ని పరీక్ష రాయకుండా బయటకు పంపించివేశారు. సదరు విద్యార్థిని హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.