04-02-2026 01:08:29 AM
బేల, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడి పై వీధి కుక్కలు దాడి చేసి, తీవ్రంగా గాయపర్చిన ఘటన బేల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మంగళవా రం మండల కేంద్రానికి చెందిన భోయర్ దేవాన్ష్ (4) అనే బాలు డి ఇంటి బయట ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు బాలునిపై దాడి చేశాయి. బాలుడి అరుపులు విని ఇంట్లో నుంచి కుటుంబీకులు రావడంతో బాలుడిని వదిలి కుక్కలు వెళ్లిపోయా యి.
ఈ ఘటనలో బాలుడి ముఖంతో పాటు ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించిన, అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.