మిస్సింగ్ కేసు నమోదు
25-07-2026 10:41 AM
బోధన్, జూలై 25, (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని తీర్ గల్లికి చెందిన అబ్దుల్ జబీర్ (33), తండ్రి అబ్దుల్ ఖయ్యూం, మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఈ నెల 22వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు బ్లూ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన సోదరుడు అబ్దుల్ అఖీల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అబ్దుల్ జబీర్ ఆచూకీ గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ను 8712659778 లేదా 8712659870 నంబర్లలో సంప్రదించి సమాచారం అందించాలని బోధన్ ఎస్‌హెచ్‌ఓ వెంకట్ నారాయణ తెలిపారు.






