20 August, 2026 | 9:59 AM

కల్వకుర్తిలో రాష్ట్ర ఆహార కమిషన్ ఆకస్మిక తనిఖీలు

20-08-2026 12:00 AM
  1. నాణ్యతారాహిత్యం, మెనూ ఉల్లంఘనలపై తీవ్ర ఆగ్రహం
  2. ఏమైనా ఇబ్బందులు ఉంటే నిర్భయంగా చెప్పండి
  3. రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

కల్వకుర్తి, ఆగస్టు ౧౯ : కమిషన్ సభ్యులు ఓరుగంట ఆనంద్, రంగినేని శారద మరియు జిల్లా అధికారులతో కూడిన బృందం బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. రేషన్ షాపులు, అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, గురుకుల హాస్టళ్లు మరియు కళాశాలల్లో ఆహార భద్రత, వసతులు, మెనూ అమలును పరిశీలించిన కమిషన్, పలు లోపాలపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలకు ఆదేశించింది.

అంత్యోదయ కార్డుదారులకు నిబంధనల ప్రకారం సరుకులు (చక్కెరతో సహా) అందించాలని డీలర్లను ఆదేశించారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు ఉన్న ఇ-కేవైసీ  ఇబ్బందులను పంచాయతీ కార్యదర్శుల ద్వారా పరిష్కరించాలని తహసీల్దార్కు సూచించారు.సరఫరా అవుతున్న కోడిగుడ్లు చిన్నగా ఉండటంతో, సంబంధిత టెండర్దారులకు నోటీసులు ఇవ్వాలని డీడబ్ల్ను ఆదేశించారు. కేంద్రాల్లో విధిగా మెనూ, నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

జెడ్పీ హైస్కూల్ బాయ్స్...

మెనూ పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు మరియు ఫుడ్ ఇంచార్జ్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీఈఓ ను ఆదేశించారు. విద్యార్థులకు వడ్డించే ముందు ఫుడ్ కమిటీ లేదా ఇంచార్జ్ ఆహారాన్ని రుచి చూడాలని చెప్పారు.

గురుకుల హాస్టళ్లు & సీబీఎం ఎంజేపీటీబీసీ బాలికల హాస్టల్లో కుళ్ళిన కూరగాయలు, నాణ్యత లేని చికెన్ అందిస్తున్నట్లు గుర్తించి ప్రిన్సిపల్ను ప్రశ్నించారు. సీబీఎం కళాశాల పరిధిలోని 10 గురుకుల కళాశాలల విద్యార్థులతో మాట్లాడి మెనూ లోపాలపై ఆరా తీశారు. హాస్టళ్లలో నిర్వహిస్తున్న ‘హెల్త్ స్టేటస్ రిపోరట్స్ బుక్’ విధానాన్ని జిల్లా అంతటా అమలు చేయాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఇటువంటి ఆకస్మిక తనిఖీలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని ఆహార కమిషన్ స్పష్టం చేసింది.