26 March, 2026 | 6:28 PM

పాఠశాలలో శ్రీరామనవమి వేడుకలు

26-03-2026 04:35 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యానికేతన్ ఒలంపియాడ్ పాఠశాలలో శ్రీరామనవమి ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన శ్రీ సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్ట కార్యక్రమం కన్నుల పండుగగా చేపట్టారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలకు చిన్నారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.