26 March, 2026 | 7:33 PM

సీసీ కెమెరాలను ప్రారంభించిన సిద్దిపేట సీపీ

26-03-2026 05:57 PM

చేర్యాల,మార్చి 26: నేరాల నివారణ కేసుల ఛేదనలో సీసీ కేమరాలు పోలీసులకు మూడో కంటిగా పనిచేస్తున్నాయనిసిద్దిపేట సీపీ రేష్మి పెర్మల్ స్పష్టం చేశారు.గురువారం చేర్యాల పట్టణంలోనీ ప్రధాన రహదారి,కాలనీలు,కూడలిలో,దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన 26 సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ ఆధునిక కాలంలో నేరాలను అరికట్టడానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరమని అన్నారు.పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు పెరిగితే పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు.

కెమెరాల ద్వారా నేరం జరిగిన వెంటనే నిందితులను గుర్తించడం సులభమవుతుందని వివరించారు.ప్రతి సీసీ కెమెరా కేవలం కేసుల పరిష్కారానికి మాత్రమే కాకుండా,నేరాలు జరగకుండా నిరోధించడంలో కూడా కీలకంగా పనిచేస్తాయని అన్నారు.ప్రత్యేకంగా ప్రధాన రహదారులు,క్రాస్ రోడ్లు, మార్కెట్ ప్రాంతాలు,బిజీ సెంటర్లలో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అవసరమని గ్రామాల్లో కూడా ఈ అవగాహన పెరగాలని,ఆయా గ్రామాల నాయకులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.సీసీ కెమెరాల ఏర్పాటులో సహకరించిన వ్యాపార సంఘాల నాయకులను సీపీ అభినందించారు. కార్యక్రమంలో చేర్యాల సీఐ రమేష్ నాయక్,చేర్యాల ఎస్ఐ అపూర్వ రెడ్డి,కొమురవెల్లి ఎస్సె మహేష్,మద్దూరు ఎస్ ఐ ఆసిఫ్ చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ బాలనర్సయ్య వైస్ చైర్మన్ మెడిశెట్టి ఉమా శ్రీధర్ కౌన్సిలర్స్ చేర్యాల మండల సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.