ఎప్‌సెట్‌లో శ్రీచైతన్య విజయకేతనం
అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): ఎప్‌సెట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంక్స్‌తో నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఇంజనీరింగ్‌లో స్టేట్ 3వ ర్యాంక్ ఎం వంశీధర్‌రెడ్డి, 4వ ర్యాంక్ జె రోషన్ మణిదీప్, 9వ ర్యాంక్ బి సమీరాజ్ రెడ్డి, అగ్రి/ఫార్మాలో 3వ ర్యాంక్ జి సాహితి గీతిక, 5వ ర్యాంక్ అమైర్ అనాస్, 6వ ర్యాంక్ నతన్ శేబ జెరూష, 7వ ర్యాంక్ పి అనురాగ్, 8వ ర్యాంక్ బీ సాయి శరణ్, 9వ ర్యాంక్ ఎం మారుతి సత్య శ్రీకర్, 10వ ర్యాంక్ ఆర్ మోహంతి సాధించారు.
విజయ పరంపర కొనసాగిస్తూ ర్యాంకుల సునామీ సృష్టించిన విద్యాసంస్థ శ్రీచైతన్యయేనని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోటీ పరీక్ష ఏదైనా, పరీక్ష విధానాలు ఎలా మారినా నెం.1 గా నిలిచేది తమ విద్యార్థులేనని ధీమా వ్యక్తం చేశారు.






