1 August, 2026 | 6:10 PM

Breaking News

తల్లిపాలు బిడ్డకు అమూల్యమైన వరం   •   విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •  

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో రెండో రోజు ప్రత్యేక వార్డుల సభ

06-06-2026 08:08 PM

ముఖ్య అతిథులుగా ​హాజరైన కమీషనర్ ప్రఫుల్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు. సుడా చైర్మన్ నరెంధర్ రెడ్డి

ముకరంపుర,(విజయక్రాంతి): ప్రజల సమస్యలు పరిష్కరించాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం " ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక "ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో శనివారం 5 నుండి 11 డివిజన్లు, 34 నుండి 41 డివిజన్లతో పాటు 56,57,58 డివిజన్లకు సంబంధించి కమాన్ ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్ లో "ప్రత్యేక వార్డుల సభ" జరిగింది. నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, సుడా చైర్మన్ నరెంధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.... ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక  99 రోజుల కార్యచరణలో ప్రజా సమస్యల పరిష్కారంపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, పాలకవర్గ సభ్యులు దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని అందించాలన్నారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ...  ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీస్కెల్లాల్సిన భాధ్యత అధికారుల పై ఉందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల ప్రతి సమస్యను పరిష్కరించాలని కోరారు. కరీంనగర్ లో అభివృద్ధి శరవేగంగా సాగుతోందన్నారు.

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరెంధర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమమే ద్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రజల సమస్యలు పరిష్కరించి సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ ను సుంధరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.