సిద్ధార్థలో ఘనంగా బోనాల వేడుకలు
08-08-2026 05:53 PM
ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని భగత్నగర్ సిద్ధార్థ పాఠశాలలో బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ దాసరి స్వప్న రెడ్డి పోచమ్మ తల్లికి జ్యోతి ప్రజ్వలన చేసి పూజను ఆరంభించారు. మహిళా ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు బోనాలు ఎత్తుకొని సందడిచేసారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు, విద్యార్థులు పాల్గొన్నారు.






