2 March, 2026 | 10:42 PM

జడ్పీ హైస్కూల్ సమస్యల పరిష్కరించండి

02-03-2026 08:56 PM

47వ డివిజన్ కార్పొరేటర్ జివిఆర్ 

పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డివిజన్ పరిధిలోని పాత పాల్వంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు అధికారులను కోరారు. సోమవారం పాఠశాలలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానంగా పాఠశాల గేటు తెరిచి ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని, గేటుకు తాళం వేసి ఉంచాలన్నారు. వీధి లైట్లు లేకపోవడంతో అకతయలు పాఠశాలలోకి రాత్రివేళలా ప్రవేశించి మద్యం విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.