6 August, 2026 | 3:51 AM

రక్త మైసమ్మకు రూ.8.73లక్షల వెండి కిరీటం సమర్పణ

06-08-2026 01:37 AM

మొయినాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి):మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ గ్రామంలో శ్రీ రక్త మైసమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ పుణ్యవేళ అమ్డాపూర్ మాజీ సర్పంచ్ బుర్గు రవళి గోపీకృష్ణ రెడ్డి తన భక్తిప్రపత్తులను చాటుకుంటూ అమ్మవారికి రూ.8.73 లక్షల వి లువైన వెండి కిరీటాన్ని సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన, ఆలయ పూజారుల వేదమంత్రోచ్ఛారణల నడుమ వెండి కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రముఖులు, యువకులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.