10 April, 2026 | 2:12 AM

మైనర్‌పై లైంగిక వేధింపులు..

10-04-2026 12:37 AM

నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

జిల్లా ఎస్పీ: మహేష్ బి గితే 

వేములవాడ, ఏప్రిల్ 9,(విజయక్రాంతి): మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు ఎదురుగట్ల అజయ్(27), అంబేద్కర్ నగర్, వేములవాడకు సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించారు. వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అజయ్, గౌరవేణి నాగరాజు (జువెనైల్) కలిసి మైనర్ బాలికను కిడ్నాప్ చేసి వేధింపులకు పాల్పడగా, బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

అప్పటి డీఎస్పీ వెంకటరమణ దర్యాప్తు చేసి చార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో ఎస్త్స్ర రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ మహేందర్, సిఎంఎస్ కానిస్టేబుల్స్ నవీన్, వెన్నెలలు 18 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నేరం రుజువవడంతో కోర్టు శిక్ష విధించింది.ఏ 1 గౌరవేణి నాగరాజు జువెనైల్ కావడంతో అతని కేసు జువెనైల్ కోర్టులో కొనసాగుతోంది.జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే దర్యాప్తు చేసిన డీఎస్పీ వెంకటరమణ, సీఐ వీరప్రసాద్, పిపి పెంట శ్రీనివాస్, ఎస్త్స్ర రవీంద్ర నాయుడు, మహేందర్, నవీన్, వెన్నెలలను అభినందించారు.