ఆరుతడి పంటలు సాగు చేయాలి
నల్లబెల్లి, జులై 20 (విజయక్రాంతి): ఎల్నినో ప్రభావముతో వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో వరి పంటకు బదులు ఆరుతని పంటలు సాగు చేసుకోవాలని ఏవో రజిత రైతులను కోరారు. అతీ తక్కువ వర్షపాతము నమోదు కావడం వల్ల, భూగర్భ జలాల నీటి మట్టము తక్కువ అవుతుందని, రైతులు ఎక్కువ నీరు వినియోగించే వరి పంట కి బదులు తక్కువ నీరు వినియోగించుకునే, ఆరుతడి పంటలు కందులు, బొబ్బర్లు,చిరు ధాన్యలు, రాగులు, కొర్రలు, సజ్జలు, నూనెగింజలు,
ప్రోద్దుతిరుగు, వేరుశనగ లాంటి పంటలు వేసుకోవాలని, రైతులు పంటలకు నీటి సామర్థ్యథ వినియోగం తెలుసుకుని, నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆమె కోరారు. నాగరాజుపల్లి, కొండాపూర్, దస్తగిరిపల్లి, గుండ్లపహాడ్ గ్రామాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ వో లు విశ్వభాను, శివకుమార్, త్రివేణి, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.






