8 July, 2026 | 8:09 PM

Breaking News

వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •  

మెల్లకుంటతండా సర్పంచ్ బాల్య నాయక్ కు ఘన సన్మానం

17-12-2025 07:44 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని మెల్లకుంట తండా గ్రామ పంచాయతీకి ఎన్నికైన నూతన సర్పంచ్ నాయక్ ను, మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సర్పంచ్ పదవి బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సమిష్టి కృషితో మెల్లకుంట తండా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులతో పాటు గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.