22 August, 2026 | 12:05 PM

మసీదుల వద్ద పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి

22-08-2026 12:00 AM

హెచ్‌ఎమ్డబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అధికారులకు మాజీ కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్ వినతి 

ముషీరాబాద్,ఆగస్టు 21(విజయక్రాంతి): మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని మసీదుల పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా చేపట్టాలని కోరుతూ భోలక్పూర్ వార్డు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ వాజిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో శుక్రవారం  హెచ్‌ఎమ్డబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ డివిజన్-5 జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డిని కలిసి వినత్పత్రాన్ని అందజేశారు. ఈ నెల 26న జరగనున్న మిలాద్ ఉన్ నబీ ఉత్సవానికి ముందుగా ముషీరాబాద్

నియోజకవర్గంలోని సుమారు 33 మసీదుల పరిసరాల్లో మురుగునీటి పైపులైన్లను శుభ్రం చేయాలని, మసీదులకు వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని కోరారు. దీనిపై శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ సంబంధిత అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భోలక్పూర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ రహీం ఉద్దీన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ చంద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.