ఎస్ ఐని కలిసిన జర్నలిస్టులు
గూడూరు, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు ఎస్ ఐ గా బాధ్యతలు చేపట్టిన సీ హెచ్ రమేష్ బాబు ను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహకారం ఉంటుందని, మీడియా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖకు జర్నలిస్టులు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలోగూడూరు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) గూడూరు మండల అధ్యక్షుడు గుర్రపు యాకాంబ్రం, జిల్లా ఉపాధ్యక్షులు ముక్తవరం సత్యనారాయణ, కోరే పాపయ్య, మండల నాయకులు బూరుగు నవనీత్ కుమార్, భీమగాని యాదగిరి, మంతాపురం యాకయ్య, ఎల్లంకి వెంకటేష్, భూక్య మోహన్, అరకాల రాజేందర్, పానుగంటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






