22 August, 2026 | 12:06 PM

పిప్పిరి గ్రామం సమీపంలో సబ్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు

22-08-2026 11:02 AM

బోథ్. ఆగస్ట్ 22 ( విజయక్రాంతి): నియోజకవర్గంలోని బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామం సమీపంలో సబ్ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి 5 ఎకరాల భూమిని పరిశీలించడం జరిగిందని త్వరలో మార్కెట్ యార్డ్ నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్ ఏర్పాటు అయితే అక్కడి రైతాంగానికి పంటల క్రయవిక్రయాలు జరుపుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. 5 ఎకరాలలో 5000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉండే విధంగా గోడౌన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అంతేగాక కార్యాలయం గది కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. త్వరలో టెండర్లను సైతం పిలవడం జరుగుతుందన్నారు. ఆరు కోట్ల రూపాయలతో స్థానిక మార్కెట్ యార్డులో కాంపౌండ్ వాల్ 2500 మెట్రిక్ టన్నులు సరిపడే నిర్మాణం కోసం ప్రతిపాదన పంపించామన్నారు. మార్కెట్ యార్డును మరింతగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్దాం అన్నారు.