3 June, 2026 | 4:07 PM

ఆర్టీసీ బస్సు బీభత్సం.. చక్రాల కింద ఇరుక్కున్న వ్యక్తి

03-06-2026 03:25 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్‌ స్టేషన్‌(Jubilee Bus Station) వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు శివ బస్సు టైర్ల కింద ఇరుక్కుపోయాడు. గమనించిన మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు తక్షణమే అప్రమత్తమమై శివను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు కింద పడిన శివకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో బస్సును పక్కకు జరిపారు. బస్సు జేబీఎస్‌ నుంచి కార్ఖానా వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోటుచేసుకుంది