5 March, 2026 | 9:19 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు రూ.111 కోట్లు చెల్లింపులు

05-03-2026 02:35 AM

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, మార్చి 4 (విజయ క్రాంతి) :ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు జిల్లా వ్యాప్తంగా 5201 ఇందిరమ్మ ఇండ్లకు గాను 111 కోట్లు చెల్లించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. బుధవారం కౌడిపల్లి మండల కేం ద్రంలోని నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జి ల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన పనులు ప్రారంభించి,

ని ర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ప్రతివారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల బిల్లులను చెల్లిస్తున్నట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా వివి ధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తి చేసుకోవాలని పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ ఎంపీడీవో హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.