5 March, 2026 | 10:38 AM

సీఎం సన్మానానికి ఎమ్మార్పీఎస్ దూరం

05-03-2026 02:36 AM

మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సంతోష్

సిద్దిపేట క్రైమ్, మార్చి 4 : మాదిగ ఉద్యోగులు, మేధావులు అని చెప్పుకుంటూ ఈ నెల 6న హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎ మ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డికి సన్మానం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మాదిగ ఉ ద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మరాఠీ సంతోష్, ఉపాధ్యక్షుడు నరేష్ తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి మాదిగ ఉద్యోగ సమా ఖ్య నాయకులు మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు.

6న జరిగే సన్మాన కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ పాల్గొనడం లేదని తెలిపారు. ఎమ్మార్పీఎస్ కు అనుబంధంగా ఉ న్న మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు గానీ, ఎమ్మార్పీఎస్ నాయకులు గాని ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో ఎమ్మా ర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మొక్కపల్లి రాజు, నాయకులు మల్లిగారి యాదగిరి, నాగరాజు, కిష్టయ్య పాల్గొన్నారు.