విద్యతోనే విప్లవాత్మక మార్పులు
- విద్యార్థులు బాగా చదివి అభివృద్ధిలోకి రావాలి
- ఎంపీ ఆర్ కృష్ణయ్య
- టెన్త్ ప్రథమ శ్రేణిలో పాసైన వారికి అవార్డులు అందజేత
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): విద్య ద్వారానే సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణ య్య పేర్కొన్నారు. విద్యార్థులందరూ విద్య ను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. 1974లో ఎస్సీ ఎస్టీలకే హాస్టళ్లు ఉండేవని, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1978లో బీసీలకు హాస్టళ్లు సాధించామన్నారు.
బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో జరిగిన పదో తరగతి పాసై మండలంలో మొదటి స్థానంలో వచ్చిన 629 మంది విద్యార్థినీ విద్యార్థులకు అవార్డులను అందజేశారు. ముఖ్య అతిథులుగా ఎంపీలు ఆర్ కృష్ణయ్య, మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నా రు. ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు వీహెచ్, బీసీటీఏ ప్రధాన కార్యదర్శి లక్ష్మి గౌడ్, రాష్ట్ర కార్యదర్శి సంపత్, రాఘవేందర్, బాలగోపాల్, వెంకట్, రామదాసు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






