13 April, 2026 | 11:49 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

పాలన విధానాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ సర్కార్

09-10-2025 06:29 PM

బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి జీడి సుందర్..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: రాష్ట్రంలో పాలన విధానాన్ని రేవంత్ సర్కార్ ఖూనీ చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ జాజిరెడ్డిగూడెం మండల కార్యదర్శి జీడి సుందర్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని,బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేయడం లేదని అన్నారు. కోర్టుల్లో కేవలం హడావుడి చేస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.