calender_icon.png 6 February, 2026 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్ భారసా రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్యగౌడ్

06-02-2026 12:33:05 AM

సంస్థాన్ నారాయణపూర్, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): తెలంగాణలో ప్రజల హామీలను గాలికొదిలేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని భరాసా పార్టీ రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్యగౌడ్ అన్నారు.గురువారం నారాయణపురం మండల కేంద్రంలో భారసా పార్టీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని బొగ్గు కుంభకోణం,

ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేని తమ అసమర్థతను, వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తోందని,ఎన్ని నోటీసులు ఇచ్చినా,ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో భారసా నాయకులు తెలంగాణ బిక్షం, లారీ భిక్షం,వడ్డేపల్లి రాములు,ఉప్పల ఆంజనేయులు,ఉప్పల శ్రీను,ఎడ్ల సత్తయ్య, పాలకుర్ల సతీష్, సిలివెరు శంకర్, యాదయ్య పాల్గొన్నారు.