25 February, 2026 | 4:24 AM

అనాథలకు.. అందని ఆశ్రయం

25-02-2026 01:01 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో షెల్టర్ ఏర్పాటు చేసిన ప్రారంభం కాలే

ఇకనైనా అనాథలకు దహన సంస్కరణలు మున్సిపల్ కార్పొరేషన్ పట్టించుకుంటుందా?

అనాథ శవాలు డంపింగ్ యార్డుకే కథనంకు స్పందన

ఎల్లప్పుడు అనాధలకు వైద్య సేవలు అందిస్తున్నాం 

వైద్య చికిత్సలు అందించడం మరణిస్తే పోస్టుమార్టం వరకు మా బాధ్యత : రంగా అజ్మీర, జిల్లా జనరల్ హాస్పిటల్ సూపరి టెండెంట్

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఏ దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు.. అనాధలకు ఆ దేవుడే ప్రభుత్వ అధికారులు. సమాజంలో అనాధలుగా మారిన మనుషులకు మేమున్నామని భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అమలు చేయాల్సిన అధికారులు అ నుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తరుణంలోని ఎవరు మరణించిన వారి మత మాదిరిగా దహన సంస్కరణ నిర్వహిస్తే వారి ఆత్మ శాంతి చేకూరుతుందని నాటి నుంచి వస్తున్న మాట. కాగా అనాధలకు మాత్రం జీవించినంత కాలం దిక్కులేని వారి గా జీవిత పోరాటం చేసి మరణించిన త ర్వాత కూడా వారికి కనీసం దహన సంస్కర ణ కూడా జరగడం లేదు.

నిబంధనలు పాటించి దహన సంస్కరణలు నిర్వహించాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదని తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు వచ్చిన మెరుగైన వైద్య సేవలు అందించి వారి ప్రాణాలను కా పాడే దిశగా చర్యలు తీసుకుంటున్నామని జి ల్లా జనరల్ హాస్పిటల్స్ సూపర్డెంట్ చెబుతున్న మాట. ఇక్కడి వారికి బాగానే ఉన్నప్ప టికీ జిల్లా జనరల్ హాస్పిటల్ నందు అనాధల కోసం ఏర్పాటుచేసిన భవనం అసలు ప్రారంభానికి నోచుకోకుండా అనాధల కన్నీటికి కారణం అవుతుంది.

- అనాధలం కదా సార్ అడిగే వారు ఎవరు ఉంటారు?

 జర ఒక్కసారి ఇటువైపు చూడండి సార్. అసలే అనాధలం ఆపై మాకు రోగం వచ్చిన బాధ వచ్చిన మేము చెప్పేదే సర్కారులకే. మా కన్నీటి వేతనం తీర్చే శక్తి ప్రభుత్వ అధికారులకే ఉంటుంది. మనసున్న మనుషులు కొంత సహాయం చేస్తేనే ఎంతో కొంత అడ్డుకొని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ పథకాలను ఆశించకుండా జీవిస్తున్నాం. మాకు కావాల్సింది ఒక్కటే అనారోగ్యం వస్తే వైద్య సదుపాయాలు.... మా కాలం చెల్లి మే ము మరణిస్తే మాకంటే కాల్చేందుకు దహన సంస్కరణలు మాత్రమే. ఈ సమాజం లో మమ్మల్ని అనాధలుగా చేసిన ప్రభుత్వ అధికారులు మాత్రం మాకు అవసరమైన తుది సహాయ సహకారాలు అందించాలని వేడుకుంటున్నాం అంటూ అనాధలు కన్నీటి వ్యతతో చెబుతున్న మాట. 

అనాధల కోసం ఆశ్రయం ఏర్పాటుచేసిన ఫలితం శూన్యం..

జిల్లా జనరల్ హాస్పిటల్ నందు ఎవరు లేని అనాధలను ఆశ్రయం కల్పించాలని సం కల్పంతో ప్రత్యేకంగా ఒక భవనాన్ని ఏర్పా టు చేశారు. ఆ భవనంలో అవసరమైన బె డ్లు కూడా అందుబాటులో ఉంచారు. ఈ స దుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఉన్నత అధికారులు సైతం అవసరమైన చర్యలు తీ సుకుంటున్నప్పటికీ ఓ స్వచ్ఛంద సంస్థకు ఈ భవన నిర్వహణ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తుంది.

కాగా ఆ భవనం అందుబాటులోకి తీసుకువచ్చి అనాధలకు ఆశ్రయం కల్పించడంలో అనుమతులు పొందిన ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మాత్రం ఆ భవనాన్ని ప్రారంభించేందుకు అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెల్లడిస్తున్నట్లు సంబంధిత అధికార యంత్రంగం చెబుతుంది. నిధులు ఖర్చు చేసి సదుపాయాలను కల్పించిన అనాధలకు మాత్రం ఆ సదుపాయాలు అందడం లో మరి ఎన్ని రోజులు పడతాయో వేచి చూడవలసిన దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న సదుపాయాలను అందు బాటులోకి తెచ్చి అనాధలను ఆదుకుంటూ ఏదైనా జరగరానిది జరిగితే వారి మతానికి సంబంధించి దాన సంస్కరణ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మెరుగైన వైద్య సేవలు మరణిస్తే పోస్టుమార్టమే మా బాధ్యత : రంగా అజ్మీర, జిల్లా జనరల్ హాస్పిటల్ సూపరి టెండెంట్

 జిల్లా జనరల్ హాస్పిటల్ నందు వైద్య చికిత్సల కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. అనాధల శవాలు డంపింగ్ యార్డ్కే అనే కథనం విజ య్ క్రాంతి దినపత్రికలో ప్రచురితమైనది చూశాం. అనాధలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి ఆరోగ్యం క్షమిస్తే మరణిస్తే పోస్టుమార్టం నిర్వహిస్తాం.

తదుపరి పూర్తి ఆధారాలను పోలీసు వారికి అందజేస్తాం. పోలీస్ వారు అనాధ సేవలను మున్సిపల్ కార్పొరేషన్ వారికి అందజేయడం జరుగుతుంది. దహన సంస్కరణలు పూర్తిస్థాయిలో మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. ఆ చర్యలు జరుగుతు న్నాయా లేదా అనే విషయం మాకు తెలియదు. ఈ విషయాన్ని కూడా సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుంది.