వనమహోత్సవం సందర్భంగా ఇంటింటికి మొక్కల పంపిణీ
03-07-2026 01:57 AM
చిట్యాల, జూలై 2: వనమహోత్సవం సందర్భంగా మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఇంటింటికి ఆరు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం పంపిణీ చేసిన మొక్కలను తప్పనిసరిగా నాటి సంరక్షించాలని కోరారు.
పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించి భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, వార్డు సభ్యులు ఈరమల్ల దయాకర్, వలిగొండ కవిత సత్యనారాయణ, రొండి నరసింహ, దేశపాక మధు, పెరిక నాగరాజుతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.






