9 May, 2026 | 5:51 AM

జిల్లా అటవీశాఖ అధికారిని కలిసిన సామిల్, టింబర్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు

09-05-2026 12:33 AM

కామారెడ్డి, మే 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారి బాధ్యతలు చేపట్టిన నీరజ్ కుమార్ తిబ్రివాల్ ను శుక్రవారం కామారెడ్డి జిల్లా సామిల్, టింబర్ మార్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సామిల్ టింబర్ డిపో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పోతరాజు వెంకటేష్ పెరక, ప్రధాన కార్యదర్శి వాజిద్, కోశాధికారి తమిం, వైస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, చీఫ్ అడ్వైజర్ అజాం ఖాన్, సలహాదారు అన్వర్ యూసుఫ్, చంద్రం, సభ్యులు నాగరాజు, స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.