5 May, 2026 | 8:12 PM

Breaking News

నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు   •   మృతురాలి పాపని చూసి కన్నీటి పర్యంతమైన సీతక్క   •   రాష్ట్రంలోనే వంద శాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండవ గ్రామం సోమ్లా నాయక్ తండా   •   పిఎసిఎస్ చైర్మన్‌గా అలీ బిన్ అహ్మద్ బాధ్యతల స్వీకరణ   •   జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు..   •   ఏరియా పర్సనల్ మేనేజర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తిరుపతి   •   సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి   •   యాదగిరిగుట్టను రాష్ట్రానికి మోడల్ గా తీర్చిదిద్దుదాం   •  

హెచ్‌సీఏకు ఊరట

12-09-2025 12:59 AM

ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలు విడుదల

చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఊరట లభించింది. గతంలో విచారణలో భాగం గా హెచ్‌సీఏ బ్యాంకు ఖాతాలను సీఐడీ ఫ్రీజ్ చేసిం ది. దీంతో హెచ్‌సీఏ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఫ్రీజ్ చేసిన ఖాతాలను విడుదల చేయాలని సీఐడీకి గురువారం ఆదేశాలు జారీ చేసింది.

హెచ్‌సీఏ నిబంధనల మేరకు ఖాతాల  నిర్వహణకు అనుమతిచ్చింది. లావాదేవీలకు అనుమతించాలని బ్యాంకును హైకోర్టు ఆదేశించింది. కాగా హెచ్‌సీఏ బ్యాంకు ఖాతాలకు, అవినీతి కేసులో అరెస్టు అయిన వారికి సంబంధం లేదని కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా నిబంధనల మేరకు లావాదేవీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.