రెడ్డి సంఘం స్మశాన వాటిక అభివృద్ధి పనులు పూర్తి
మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్
ఉప్పల్,(విజయక్రాంతి): రూ.58 లక్షల వ్యయంతో నాచారం బాబా నగర్ లోని రెడ్డి స్మశాన వాటికలో అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకోవడంతో రెడ్డి సంఘం సభ్యుల తో కలిసి మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ స్మశాన వాటికను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రెడ్డి సంఘం స్మశాన వాటిక ఎన్నో సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ఆమె పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మణ్ రెడ్డి చొరవతో స్మశాన వాటిక పనులు చివరి దిశకు చేరుకొని అని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం నాయకులు కార్పొరేటర్ కు మరియు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రం శ్రీనివాస్ రెడ్డి భూపాల్ రెడ్డి రమణారెడ్డి మోహన్ రెడ్డి శంకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు




