ఉప్పల్ నియోజకవర్గంలో చెరువులకు మహార్ధశ
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు చేయనట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం హెచ్ఎంటి పెద్ద చెరువును కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ పరమేశ్వర్‌రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులుతో కలిసి మంగళవారం రోజు ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలోని చెరువులను రూ.102 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. చెరువులలో అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులను కూడా చేపడుతున్నట్టుగా ఆయన తెలిపారు. అనంతరం ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నట్టుగా ఉప్పల్ నియోజకవర్గం ఆయన తెలిపారు.
నియోజకవర్గంలో మొదటి విడతలో నాలుగు చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు నిధులు సైతం మంజూరు చేయించినట్టుగా చెప్పారు. ఉప్పల్ నల్ల చెరువు రూ.20 కోట్లు, నాచారం(హెచ్ఎంటీనగర్) చెరువు రూ.30 కోట్లు, కాప్రా చెరువు రూ.35 కోట్లు, రామంతాపూర్ పెద్ద చెరువు రూ.17 కోట్ల చొప్పున నిధులొచ్చినట్టుగా తెలిపారు. ఇప్పటికే ఉప్పల్ నల్లచెరువులో పనులను చేపట్టి తుది దశలో ఉన్నాయన్నారు. అతిత్వరలోనే నాచారం. మిగతా చెరువులలో పనులను చేపట్టనున్నట్టుగా పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.




