రియల్ మార్కెట్ రిపీట్
- జోరందుకున్న స్థిరాస్తి వ్యాపారం
- ఉమ్మడి నల్లగొండలో పెరిగిన రిజిస్ట్రేషన్ల రాబడి
- 4 నెలల్లో రూ.155.63 కోట్ల ఆదాయం
- జిల్లా కేంద్రాల్లోనే అత్యధిక ఆదాయం
- రిజిస్ట్రేషన్లలో నల్లగొండ ఫస్ట్.. రామన్నపేట లాస్ట్..
నల్లగొండ / కట్టంగూర్, ఆగస్టు 20 (విజయ క్రాంతి) : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొద్ది నెలలుగా మందగమనంలో సాగిన స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) వ్యాపారం మళ్లీ ఊపందుకుంటోంది. రియల్ మార్కెట్ మళ్లీ పుంజుకోవడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానాకు కాసుల వర్షం కురు స్తోంది. భూములు, ప్లాట్ల కొనుగోళ్లకు మళ్లీ అనుకూల వాతావరణం ఏర్పడటంతో రి యల్ రంగానికి సరికొత్త ఊపిరి లభించినట్లయింది.

గత కొద్దిరోజులుగా భూములపై పె ట్టుబడులు పెట్టేందుకు స్థిరాస్తి వ్యాపారులతో పాటు సాధారణ మధ్యతరగతి ప్రజలు కూడా వెనుకంజ వేశారు. అయితే తాజాగా మార్కెట్లో వచ్చిన సానుకూల మార్పులతో జిల్లాకు చెందిన బడా వ్యాపారులతో పాటు హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతా ల నుంచి పెట్టుబడిదారులు స్థిరాస్తులు కొ నుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటం తో రిజిస్ట్రేషన్ల లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి.
4 నెలల్లో రూ.155.63 కోట్ల ఆదాయం
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 15 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడిచిన నాలు గు నెలల కాలంలో మొత్తం 47,571 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. దీనిద్వారా ప్రభుత్వానికి రూ. 155.63 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే రాబడి గణనీయంగా పెరగడం గమనార్హం.
గత ఏడాది ఇదే నాలుగు నెలల వ్యవధిలో 49,814 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరగ్గా, రూ. 134.84 కోట్ల ఆదాయం మా త్రమే వచ్చింది. డాక్యుమెంట్ల సంఖ్యతో పో లిస్తే, ఈసారి ఆస్తుల విలువ పెరగడం.. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరగడంతో ప్రభుత్వానికి ఏకంగా రూ. 20.79 కోట్లకు పైగా అదనపు రాబడి రావడం విశేషం.
జిల్లా కేంద్రాల్లోనే అత్యధిక రాబడి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్కిళ్ల వారీగా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే.. జిల్లా కేంద్రాల్లోనే అత్యధిక రాబడి నమోదు కావడం స్పష్టమవుతోంది. ఉమ్మడి జిల్లా మొత్తంలో నల్లగొండ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం అత్యధిక రాబడితో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ 7,302 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వా రా రూ. 26.70 కోట్ల భారీ ఆదాయం వచ్చింది.
సూర్యాపేట సర్కిల్లో 6,124 డాక్యుమెంట్ల ద్వారా రూ. 19.25 కోట్ల రాబడి స మకూరి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఉ మ్మడి జిల్లాలోని 15 కార్యాలయాల్లో రామన్నపేట అత్యల్ప రాబడి నమోదు చేసి చివరి స్థానంలో నిలిచింది. ఇక్కడ కేవలం 912 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ. 1.81 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది.
హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో భూ వెలుగులు
జిల్లా కేంద్రాల తర్వాతి స్థానాల్లో రాజధాని హైదరాబాద్కు సమీపంలో ఉన్న కారి డార్లు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నా యి. భువనగిరి (రూ. 17.05 కోట్లు), యాదగిరిగుట్ట (రూ. 14.94 కోట్లు), చౌటుప్పల్ (రూ. 14.94 కోట్లు), బీబీనగర్ (రూ. 11.52 కోట్లు) ప్రాంతాల్లో భూముల విలువ మరి యు రియల్ వెంచర్ల కార్యకలాపాలు ఎక్కువగా ఉండటంతో స్థిరమైన రాబడి వస్తోంది. ఇక వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ (రూ. 13.36 కోట్లు), కోదాడ (రూ. 10.70 కోట్లు) పరిధిలోనూ రిజిస్ట్రేషన్ల జోరు కొనసాగుతోంది.






