28 August, 2026 | 10:27 AM

హిందువుల పండుగపై వివక్షా?

28-08-2026 09:53 AM

రాఖీ పండుగ రోజున.. రెజీనా స్కూల్ తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం

పాల్వంచ,(విజయక్రాంతి): రాఖీ పండుగ( Rakhi festival) సందర్భంగా రాష్ట్రంలోని పాఠశాలలకు హైచ్చిక సెలవు ప్రకటించినప్పటికీ, పాల్వంచలోని రెజీనా స్కూల్( Regina School) మాత్రం ఒక పూట పాఠశాలను నిర్వహించడం, హాజరుకాని విద్యార్థులకు రూ.100 జరిమానా విధించడం దారుణ మనీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందువుల(Hindu festival) ముఖ్యమైన పండుగ రోజున విద్యార్థులకు సెలవు ఇవ్వకుండా పాఠశాల నిర్వహించడం, పైగా రాని విద్యార్థులకు జరిమానా విధించడం హిందూ పండుగల పట్ల వివక్ష చూపుతున్నట్లుగా ఉందని తల్లిదండ్రులు, పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగల విషయంలో విద్యార్థుల మతపరమైన భావాలను గౌరవించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉంది. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి, పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాల విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.