"పెద్దమ్మ గుడిలో ఘనంగా చండీ హోమం"
పాల్వంచ,ఆగస్టు 28,(విజయక్రాంతి): శ్రావణి పౌర్ణమిని పురస్కరించుకొని దేవస్ధాన కార్యనిర్వాహాణాధికారి యస్ రజనీకుమారి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం-జగన్నాధపురం లో వెలసిన శ్రీ కనకదుర్గా (పెద్ధమ్మ తల్లి ) దేవస్ధానంలో శుక్రవారం చండీహోమంను ఘనంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలతో,వేద మంత్రాలతో అమ్మ వారి ఉత్సవ విగ్రహాన్ని దేవాలయం నుండి యాగశాలకు తీసుకవచ్చి మండపారాధన, గణపతి పూజలు జరిపిన అనంతరం చండీహోమం, చివరిన పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.ఈ హోమంలో 17 మంది దంపతులు ఒక్కొక్కరు రూపాయలు 2,516/- రుసుము చెల్లించి చండీహోమంలో పాల్గొన్నారు. హోమం అనంతరం అర్చకులు,వేద పండితులు హోమంలో పాల్గొన్న భక్తులకు ఆశీర్వచనంతో పాట అమ్మ వారి శేష వస్ర్తం, ప్రసాదమును అఃదచేసారు.చండీహోమంలో పాల్గొ్న్న భక్తులకు అన్న ప్రసాద వితరణను గావించారు. ఈ కార్యక్రమం లో సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
పెద్దమ్మ తల్లికి ఘనంగా పంచామ్రుతాభిషేకం
శ్రీ పెద్దమ తల్లికి పంచామ్రుతములతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. దేవాలయంలోని అమ్భ వారి మూల విరాట్ కు పంచామ్రుతాలతో అభిషేకం అనంతరం పంచ హారతులు,నివేదన,నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవస్ధాన అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.






