30 May, 2026 | 2:07 AM

పాఠశాల గేటు ముందు వర్షపు నీరు నిల్వ

30-05-2026 12:00 AM

అలంపూర్, మే 29: మానవపాడు మండల కేంద్రంలోని  శుక్రవారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి స్థానిక దళితవాడలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రధాన గేటు ముందు వర్షపు నీరు భారీగా నిల్వ ఉండటంతో  విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారి పూర్తిగా మురికి నీటితో నిండిపోవడంతో చిన్నారులు నీటిలో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తేది.

అయితే  స్థానికుల ప్రకారం.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య తలెత్తుతోందని నిల్వ నీటివల్ల దోమలు పెరిగే ప్రమాదం ఉండటంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పాఠశాల పునః ప్రారంభం కాక ముందే అధికారులు వెంటనే స్పందించి నీరు తొలగించి, శాశ్వత పరిష్కారం కోసం డ్రైనేజీ సదుపాయం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.