25 April, 2026 | 2:21 AM

కిమ్స్ హాస్పిటల్స్‌కు క్యూఏఐ అక్రిడేషన్

25-04-2026 01:10 AM

స్ట్రోక్ కేర్‌లో కీలక మైలురాయి

హైదరాబాద్, ఏప్రిల్ 24(విజయక్రాంతి) : కిమ్స్ హాస్పిటల్స్, మినిస్టర్ రోడ్ తెలంగాణలో స్ట్రోక్ చికిత్సలో అత్యుత్తమ ప్రమాణాలను సాధించి, క్వాలిటీ అండ్ అక్రిడేషన్ ఇనిస్టిట్యూట్ (క్యూఏఐ) నుంచి అక్రిడేషన్ పొం దిన తొలి, ఏకైక ఆసుపత్రిగా నిలిచింది. ఈ గుర్తింపు అత్యవసర న్యూరాలజీ సేవల్లో నాణ్యత, వేగం, రోగి కేంద్రిత వైద్య సేవల పట్ల ఆసుపత్రి కట్టుబాటును ప్రతిబింబిస్తుంది.

స్ట్రోక్ నిర్వహణలో వేగవంతమైన నిర్ధారణ, ఆధారిత వైద్యం (ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్), సమన్వయంతో కూడిన స్ట్రోక్ స్పందన వ్యవ స్థ, పునరావాస సేవలు, రోగి భద్రత వంటి కఠిన ప్రమాణాలను పాటించే ఆసుపత్రుల కు క్యూఏఐ అక్రిడేషన్ ప్రధానం చేయబడుతుంది. ప్రముఖ స్ట్రోక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుభాష్ కౌల్ మాట్లాడుతూ, స్ట్రోక్ చికిత్స లో ప్రతి నిమిషం అ త్యంత కీలకం. స్ట్రోక్ ప్రారంభమైన ప్రతీ ని మిషం లక్షలాది న్యూ రాన్లు నశించే ప్రమాదం ఉంది.

సమయానికి, ఖచ్చితమైన చికిత్స అందితే మెదడు పనితీరును కాపాడుకోవచ్చు, వైకల్యాన్ని త గ్గించవచ్చు, రోగులు సాధారణ జీవితానికి తిరిగి చేరుకునే అవకాశముంటుంది. ఈ అ క్రిడేషన్ మా వేగవంతమైన స్పందన విధానాలు, సమర్థవంతమైన చికిత్సా ప్రమాణాల కు గుర్తింపుగా నిలుస్తుందన్నారు. కిమ్స్ గ్రూ ప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ భాస్క ర్ రావు మాట్లాడుతూ, అధునాతన స్ట్రోక్ చికి త్స, నిపుణుల న్యూరాలజీ సేవలు, మెరుగైన రోగి ఫలితాలపై మా దృష్టిని ఈ గుర్తింపు మరింత బలపరుస్తోంది.

అత్యాధునిక సాంకేతికత, నిపుణుల బృందం, సమన్వయంతో కూడిన అత్యవసర సేవలతో అత్యుత్తమ వైద్య సేవలుందించడంలో కిమ్స్ ఎప్పటికీ ముందుంటుందన్నారు. ఈ అక్రిడేషన్‌తో కిమ్స్ హాస్పిటల్స్‌లో స్ట్రోక్ చికిత్సలో ముం దంజలో నిలిచి సమయానికి అత్యాధునిక వై ద్యసేవలు అందించే కేంద్రంగా మరింత బలపడింది. ఇది రోగుల ప్రాణాలను రక్షించడం లోనే కాకుండా,వారి జీవనప్రమాణాల ను మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషిస్తు ంది.