రూ.3.5 లక్షలతో గిరిజన పాఠశాలకు వసతుల కల్పన
25-03-2026 12:21 AM
బూర్గంపాడు,మార్చి24,(విజయక్రాంతి): మండల కేంద్రమైన బూర్గంపాడు గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలల్లో వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ, హైదరాబాద్ వారి సహకారంతో సమరిటన్స్ ఫర్ ద నేషన్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.3.5లక్షల వ్యయంతో నిర్మించిన ఒక అదనపు తరగతి గది,వాష్రూమ్ ను ఆ సంస్థ ఫౌండర్ రామ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం సమాజ బాధ్యత అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ లాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.




