17 April, 2026 | 6:04 PM

పిఆర్సి ఫిట్మెంట్ ప్రకటించి పెండింగ్ డీఏలు విడుదల చేయాలని నిరసన

17-04-2026 04:19 PM

- ఉద్యోగుల హెల్త్ కార్డులు విడుదల చేయాలి, సిపిఎస్ ను రద్దు చేయాలి

- 13వేల కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి

- టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ డిమాండ్

టేకులపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇవ్వాల్సిన పిఆర్సి ఫిట్మెంట్ను ప్రకటించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జెఎసి ఆధ్వర్యంలో టేకులపల్లి మండలం గంగారం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం  మధ్యాహ్న భోజన విరామ సమయంలో నినదిస్తూ నిరసన తెలపారు. ఈ సందర్బంగా  తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, 13 వేల కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే వ్యక్తిగత ఖాతాలలో జమ చేయాలి.

సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సెప్టెంబర్ ఒకటి 2003 తరువాత నియామకం పొందిన 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని, కాంట్రాక్టు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని,  రాష్ట్ర ముఖ్యమంత్రి  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, వచ్చిన ఆరు నెలల లోపు పిఆర్సి ఫిట్మెంట్ ప్రకటించి అమలు చేస్తామని,పెండింగ్ డిఎ లన్నింటిని వెంటనే విడుదల చేస్తామని,సిపిఎస్ ను రద్దు చేస్తామని ఇచ్చిన మాటను నిలుపుకోవాలి.

పే రివిజన్ కమిషన్ రిపోర్టును తెప్పించు కోకుండా కమిషన్ కాలవ్యవధిని పొడిగిస్తూ ఉపాధ్యాయ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని, వెంటనే రిపోర్టును తెప్పించుకొని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి ఫిట్మెంట్ను ప్రకటించి, పిఆర్సిని అమలు చేయాలని వారు కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల 13వేల కోట్ల పెండింగ్ బిల్లులు అన్నింటిని ఒకేసారి విడుదల చేసి వారికి న్యాయం చేయాలని కోరారు.ప్రభుత్వం ముందుంచిన 63 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.