11 August, 2026 | 1:45 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

జయశంకర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం

06-08-2026 05:54 PM

- ఎస్‌ఐ వెంకట్రాజం

- వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో జయంతి వేడుకలు

వేములవాడ,(విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ ఎస్‌ఐ వెంకట్రాజం పోలీసు సిబ్బందితో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ వెంకట్రాజం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పి ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, త్యాగాలు నేటి యువతకు ఆదర్శప్రాయమని, ప్రతి ఒక్కరూ వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.